మీర్ పేట్ బాధిత మహిళకు అండగా ఉంటాం-మంత్రి సత్యవతి రాథోడ్.

0
మీర్పేట్ పీఎస్ పరిధిలో  అర్ధరాత్రి మహిళను స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్డిగ్రీ ప్రయోగించిన ఘటన పై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ ల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పందించారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి స్వయంగా రాచకొండ సీపీకి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.
మహిళపై దాడికి పాల్పడ్డ బాద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలంటు సీపీ చౌహాన్ ను మంత్రి ఆదేశించారు.
నందిహిల్స్ కాలనీలో నివాసముంటున్న వరలక్ష్మిపై ఎల్బీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని అన్నారు.ఘటన పై సీరియస్ గా స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరిపి వెంటనే బాద్యుల పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with