ఉద్యోగుల బకాయిలపై పీఆర్టీయూ ఆగ్రహం.

0
1009965490

ఉద్యోగుల బకాయిలపై పీఆర్టీయూ ఆగ్రహం.

డోర్నకల్/మరిపెడ(జూన్ 28)నమస్తే న్యూస్.

పీఆర్సీ, డీఏ బకాయిలు,మెడికల్ బిల్లులు,జీపీఎఫ్,టీజీఎల్ఐసీ రుణాలు,రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడంపై పీఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.పీఆర్సీని వెంటనే ప్రకటించాలి.పెండింగ్ డీఏలను దశల వారీగా కాకుండా ఒకేసారి చెల్లించాలి.మెడికల్ బిల్లులు,రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలి.ఉద్యోగులు అడిగిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కారణాలు చెబుతూ దాటవేస్తోందని,బదులుగా ఆరోగ్య పథకం,బీమా పథకం పేరుతో మూల వేతనంలో 1.5% కట్ చేస్తోందని విమర్శించారు.ఒక్కో ఉద్యోగికి లక్షలాది రూపాయలు,మొత్తంగా ప్రభుత్వం వేల కోట్లు బకాయి పడిందని,దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా,మానసికంగా ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు.కోరుకున్నవి ఇవ్వకుండా ప్రభుత్వమే సొంత ప్రతిపాదనలు తెస్తే ప్రయోజనం శూన్యమని,దీనివల్ల ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య అంతరం పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వ విధానాలను అమలు చేసి విజయాలు సాధించేది ఉద్యోగులే.వారి సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with