మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. కుటుంబ కలహాలతో హత్యకు గురైన అల్లుడు.

0
1009849545

  • మహబూబాబాద్ జిల్లాలో దారుణం. 
  • కుటుంబ కలహాలతో హత్యకు గురైన అల్లుడు.


కేసముద్రం,జూన్15(నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో సొంత అల్లుడు నరేష్ హత్యకు గురైనట్లు సమాచారం. గ్రామానికి చెందిన నరేష్కు అత్తమామలు కుమారస్వామి, కళమ్మలతో కొంతకాలంగా కుటుంబ పరమైన విభేదాలు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అల్లుడు నరేష్పై మామ కుమారస్వామి దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన నరేష్ను చికిత్స నిమిత్తం తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with