ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

0

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తాం: ఎమ్మెల్యే రామచంద్రు నాయక్.


మరిపెడ, జూన్ 20, (నమస్తే న్యూస్):

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరిపెడలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించడం లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్  అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with