సత్తా చాటిన నర్సింహులపేట మండలం విద్యార్థులు.

0
1009466028

సత్తా చాటిన నర్సింహులపేట మండలం విద్యార్థులు.

నర్సింహులపేట, ఏప్రిల్ 29 (నమస్తే న్యూస్) మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం, పరిధిలోని పాఠశాలల్లో పదవ తరగతి వార్షిక రాత పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా బి. శిరీష 550 మార్కులు సాధించి నర్సింహులపేట జెడ్పి హెచ్ఎస్ పాఠశాలలో ప్రథమ స్థానం దక్కించుకుంది. టీఎస్ మోడల్ హై స్కూల్కు చెందిన బి. నందిని మరియు జీ. దర్శిని తలో 567 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. జెడ్పి హెచ్ఎస్ పెద్దనాగారం పాఠశాల నుండి ఏ. శ్రీకాంత్ 541 మార్కులు సాధించగా, కెజిబివి (KGBV) పాఠశాల విద్యార్థిని డి. మనీషా 533 మార్కులు, సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థిని ఏ. రక్షిత 564 మార్కులు సాధించారు.ఈ ఫలితాల్లో విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి తమ పాఠశాలల కీర్తిని మరింత పెంచారు.

                             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with