ఆర్టీఐ చట్టం సమర్థ అమలుకు చర్యలు తీసుకోవాలి.

0
1009883551

ఆర్టీఐ చట్టం సమర్థ అమలుకు చర్యలు తీసుకోవాలి. 
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ.


డోర్నకల్/మరిపెడ(జూన్ 19)నమస్తే న్యూస్.

సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.జిల్లా అధ్యక్షుడు అలువాల ఉమేష్ చందర్,జాతీయ చైర్మన్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పవన్ కుమార్,డీపీఓ హరి ప్రసాద్లకు వినతిపత్రం అందజేశారు.వినతిపత్రంలో మండల,గ్రామ స్థాయి అధికారులకు ఆర్టీఐ చట్టంపై సరైన అవగాహన లేకపోవడంతో దరఖాస్తులకు చట్టబద్ధంగా నిర్ణయించిన గడువులో సమాచారం అందించడం లేదని,కొన్నిచోట్ల అసంపూర్ణ సమాచారం ఇవ్వడం లేదా చట్టబద్ధ కారణాలు లేకుండానే సమాచారం నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం,దరఖాస్తుల స్వీకరణలో అనవసర పరిమితులు,ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు.ఆర్టీఐ చట్టంపై అధికారులు,సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సమాచార హక్కు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనుముల సూర్యప్రకాష్తో పాటు పలువురు ఆర్టీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with