సుప్రీం కోర్టుతీర్పు పై కాంగ్రెస్ హర్షం-పార్టీ టౌన్ అధ్యక్షుడు కాల సుమీర్ జైన్.

0
IMG-20230804-WA0074




(నమస్తే మానుకోట-డోర్నకల్)

కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు వ్యతరేకంగా పోరాడుతున్న రాహూల్ గాంధీ అక్రమ కేసులతో భాజపా వేసిన పరువు నష్టం దావా పై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ రోజు సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల  మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కాల సుమీర్ జైన్ హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో కేసు బనాయించి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దేశము సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్,  తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఆవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with