ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు… అండగా ఉంటాం: ఎమ్మెల్యే రామ్ చంద్రు నాయక్

0
1010052963

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్


నర్సింహులపేట, జూలై 8 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన ఏరానాగి సంతోష్ సతీమణి స్రవంతి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మంగళవారం రాత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,సర్పంచ్ పెదమాముల యాకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచినీళ్ల రఘు,  ఏరానాగి వెంకన్న, రావుల యాకయ్య, దోమల యాదగిరి, గిరి, ధర్మారపు రాములు, భరత్, ఉపేందర్, దూర్ యాకయ్య, జంపాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with