లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు.

0
1008680366

లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 

 క్యాన్సర్ పై అవగాహన సదస్సు


(నమస్తే న్యూస్, మియాపూర్ డివిజన్, ఫిబ్రవరి 03)

మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్ బి ఆర్ కాంప్లెక్స్లో లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్  అట్టపల్లి రామ ప్రభు ఆధ్వర్యంలో  క్యాన్సర్ పై  అవగాహన సదస్సు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై వైద్య నిపుణులు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.ఈ సందర్భంగా అట్టపల్లి రామ ప్రభు మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ అవగాహనతో పాటు ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యమే లక్ష్యంగా లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with