తండ్రి లేని విద్యార్థికి అండగా గ్రామస్తులు.. పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ బహుకరణ

0
1009883634-1

  • తండ్రి లేని విద్యార్థికి అండగా గ్రామస్తులు.. పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ బహుకరణ.
  • నేటి బాలులే రేపటి పౌరులు.. అంటూ జయపురం గ్రామస్తుల  అభినందనీయ కార్యక్రమాలు.
  • జయపురం గ్రామస్తులను అభినందిస్తున్న..పలు ఉద్యమ సంఘాలు.

సైకిల్ ను బహుకరిస్తున్న గ్రామస్తులు


నర్సింహులపేట, జూన్ 20 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బస్ తండా గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి జయపురం గ్రామస్తులు మానవతా దృక్పథంతో సైకిల్ను బహుకరించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.తండ్రి లేని ఆ విద్యార్థి ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి చదువుకోవడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలుసుకున్న గ్రామ పెద్దలు, యువకులు కలిసి అతనికి సైకిల్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యే జీవితాన్ని మార్చగల గొప్ప ఆయుధమని, ఒక విద్యార్థి బాగా చదువుకుని ప్రయోజకుడిగా ఎదిగితే సమాజానికి ఆదర్శంగా నిలిచి మరెందరో ప్రతిభావంతులను తీర్చిదిద్దగలడని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేదా రవాణా సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు.సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని, అవసరంలో ఉన్న విద్యార్థులకు అందరూ తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రావుల శ్రీనివాస్, వీరబోయిన సురేష్, కోల యాకయ్య, అన్నంగి శేఖర్, పొడుపుకంటి లక్ష్మి, వీరబోయిన రమేష్, హరీష్, రాచమల్ల మల్లయ్య, జాఫర్ తదితరులు పాల్గొని విద్యార్థికి సైకిల్ను అందజేశారు.గ్రామస్తుల ఈ సహాయానికి విద్యార్థి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with