ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం :సర్పంచ్ పెద్దమాముల యాకయ్య

0
1010093175-1

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

:సర్పంచ్ పెద్దమాముల యాకయ్య


నర్సింహులపేట, జూలై 12 (నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో రహదారి భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలను జేసీబీ యంత్రాల సహాయంతో తొలగించారు.వర్షాకాలంలో రహదారి పక్కన పెరిగిన ముళ్లపొదలు వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడంతో పాటు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పొదల తొలగింపుతో రహదారి విశాలంగా కనిపిస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడింది.ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దమాముల యాకయ్య మాట్లాడుతూ, గ్రామంలో ప్రజల భద్రత, పరిశుభ్రత, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with