కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో సైనికుల వలె పనిచేయాలి:డోర్నకల్ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

0
1009455102-1

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించే విధంగా కృషి చేయాలి: ఎమ్మెల్యే

నర్సింహులపేట, ఏప్రిల్ 27 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట భీమ్లా తండా గ్రామపంచాయతీ లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట,  మారమ్మ ఆలయం,విగ్రహప్రతిష్ట కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్…అనంతరం బొజ్జన్నపేట గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే, రామచంద్ర నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోంది. గ్రామస్థాయి కార్యకర్తలే పార్టీ బలానికి మూలం. ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడం మన బాధ్యత అని అన్నారు.

రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యం. గ్రామాల అభివృద్ధి, యువతకు ఉపాధి, రైతులకు మద్దతు ఇవే మన ముఖ్య లక్ష్యాలు.ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with