పశువైద్యాధికారి బదిలీ.. ఆదరించిన మండలప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ సౌమ్య

0
1009746540-1

నర్సింహులపేట పాడి రైతులు, పశుపోషకులకు కృతజ్ఞతలు తెలిపిన పశువైద్యాధికారి డాక్టర్ సౌమ్య.


నర్సింహులపేట, జూన్ 3 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పశువైద్యాధికారిగా గత ఎనిమిదేళ్లుగా సేవలందించిన డాక్టర్ సౌమ్య సాధారణ బదిలీపై వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, పశుపోషకులు, యాదవ సోదరులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ శాఖల అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఎనిమిదేళ్ల సేవా కాలంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతుల అభివృద్ధి, పశుసంవర్ధక రంగ పురోగతికి అందరి సహకారం ఎంతో దోహదపడిందన్నారు. తన విధి నిర్వహణలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.నర్సింహులపేట మండల ప్రజలు, రైతులు చూపిన ఆదరణను జీవితాంతం గుర్తుంచుకుంటానని డాక్టర్ సౌమ్య పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లో కూడా ఇదే విధంగా సేవలందిస్తానని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with