విద్యార్థులను ప్రతిభావంతులను చేయడమే ప్రభుత్వ పాఠశాలల లక్ష్యం :జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

0
1009416217

విద్యార్థులను ప్రతిభావంతులను చేయడమే ప్రభుత్వ పాఠశాలల లక్ష్యం:
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.



నర్సింహులపేట, ఏప్రిల్ 23(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో యానివల్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీ సందర్భంగా ఆమె ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అలాగే ఈ దిశగా పాఠశాలల పనితీరును మెరుగుపర్చాలని ఎంఈఓ కు సూచించారు.ఈ సందర్శన ద్వారా విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం పై జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అలాగే వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్  తల్లిదండ్రులకు సూచించారు వేసవి సెలవులు ప్రారంభం అయినా నేపథ్యంలో విద్యార్థులు మరియు చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని వారు కోరారు సెలవుల్లో సరదా కోసం పిల్లలును  చెరువుల లోపలకు మరియు ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడటం అత్యంత ముఖ్యమని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ  రామ్మోహన్ రావు, ఎంపీడీవో రాధిక,ఎంపీ ఓ కిన్నరి యాకయ్య,గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉపసర్పంచ్  కస యాకయ్య, ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with