పథకం పేరు మార్చితే ఉద్యమం తప్పదు-తుమ్మ రాజశేఖర్ రెడ్డి హెచ్చరిక.

0
1009436897

ఉపాధి హామీలో పూర్వ పద్ధతిని కొనసాగించాలని సంతకాల సేకరణ.

నర్సింహులపేట, ఏప్రిల్ 24(నమస్తే న్యూస్)

మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్చి చట్టంలో అనేక రకాల మార్పులు తీసుకువచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ కేకేసి తెలంగాణ జాయింట్ సెక్రెటరీ తుమ్మ రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నర్సింహులపేట మండలంలో నర్సింహులపేట జయపురం బొజ్జన్నపేట రూపుల తండా లోక్య తండా గోపా తండా గ్రామపంచాయతీలలో స్వయంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి సమస్యలను తెలుసుకొని చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కేకేసి జాయింట్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అనేక రకాల కార్మిక చట్టాలను కార్మిక లోకాన్ని అణిచివేచి విధంగా వ్యవహార ధోరణి ఉందని ఈ సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. గ్రామాల్లో సిగ్నల్ వ్యవస్థలు సరిగ్గా లేక సాంకేతిక ఇబ్బందులు జరుగుతున్నాయని కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పూర్వ పద్ధతిని తీసుకువచ్చి ఉపాధి హామీ పథకంలో కూలీలకు న్యాయం జరిగే విధంగా యంత్ర పరికరాలకు కూడా చార్జీవ్వాలనీ డిమాండ్ చేశారు. గాంధీ పేరు మీదుగా ఉన్న పథకాన్ని మతం పేరుతో పేరు మార్చి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్టేట్ మైనారిటీ సెక్రటరీ అబ్దుల్ ఖాదర్ జిలాని కన్వీనర్ కరీం మండల అధ్యక్షుడు జినుకల రమేష్ సర్పంచులు పెద్దమముముల యకయ్య నెలుకర్తి రేణుక పల్లెల విజయ రాణి లచ్చు నాయక్ జ్యోతి రాజేందర్ నాయక్ కాంగ్రెస్ వివిధ గ్రామాల నాయకులు క యాకయ్య దోమల యాదగిరి కొంపెల్లి యకయ్య గాడి పెళ్లి శ్రీనివాస్ రవి నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with