గ్రామీణ విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్.. జయపురం లో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు.!

0
1009440415

గ్రామీణ విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్.

జయపురం లో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు.!

జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు.


నర్సింహులపేట, ఏప్రిల్ 26(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో ఆదివారం  గ్రామీణ విద్యార్థులకు ఉచితం వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని,వంగాల ప్రవీణ్ రెడ్డి,విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు,కోచ్ నెలకుర్తి వీరారెడ్డి దాతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  క్రీడలకు ముఖ్యఅతిథిగా ఎస్సై మాలోత్ సురేష్  పాల్గొని వేసవి క్రీడలను  ప్రారంభించారు.అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు,యువత ఎక్కువగా మొబైల్, టీవీలకే పరిమితం అవుతున్నారు. కానీ ఈసారి ఆ అలవాట్లకు బ్రేక్ వేస్తూ ఆరోగ్యం,భవిష్యత్తు రెండింటినీ మెరుగుపరచే అద్భుత అవకాశాన్ని క్రీడాకారుల పుట్టినిల్లు జయపురం అందిస్తోంది. క్రీడలు ఆడడం వల్ల శారీరకంగా మాత్రమే కాదు,మానసికంగా,సామాజికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జయపురం అంటేనే క్రీడలకు పుట్టినిల్లని ఉచిత శిక్షణ శిబిరాల నిర్వాహకులను కోచ్ నెలకుర్తి వీరారెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బండి రమేష్,నెలకుర్తి అశోక్ రెడ్డి,విశ్రాంత పోలీస్ ఉద్యోగి నెలకుర్తి కృష్ణారెడ్డి,గ్రామస్తులు రావుల శీను,నెలకుర్తి నరసింహారెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న,కెవిపిఎస్ మందుల యాకూబ్,తదితరులు ఉన్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share with